ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సిపిఎం సీనియర్ నాయకుడు బడిపాటి.రాఘవులు మృతి

24 జులై, 2026

CPM senior leader Badipati Raghavulu passes away.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 01:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రెడ్డిగూడెం (ఎన్టిఆర్) : రెడ్డిగూడెం మండల పరిధిలోని శ్రీరాంపురం గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు బడిపాటి రాఘవులు (73) గుండెపోటుతో శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న సిపిఎం పార్టీ నాయకులు ఎం.మాధవరెడ్డి, వి.కృష్ణ రెడ్డి, పాములపాటి సత్యనారాయణరెడ్డి, మోహనరెడ్డి లు కలిసి రాఘవులు మృతదేహాన్ని సందర్శించి భౌతికకాయంపై సిపిఎం పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు. రాఘవులు కు భార్య ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమారుడు మృతి చెందాడు. పార్టీ కోసం రాఘవులు చేసిన సేవలను నాయకులు కొనియాడారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్