హైదరాబాద్ : మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అస్వస్థతకు గురయ్యారు. వాకింగ్ చేస్తున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి, తక్షణమే ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన్ను ఆసుపత్రిలోని కార్డియో-న్యూరో సెంటర్లో చేర్పించారని, ప్రస్తుతం కార్డియాలజీ విభాగం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కు అస్వస్థత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 11, 2026, 05:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)