mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కామారెడ్డిలో ముగ్గురు పిల్లలతో సహా తల్లి అదృశ్యం!

11 జూన్, 2026

o-missing
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 11, 2026, 11:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అదృశ్యమవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో లయ (31) అనే మహిళ తన ముగ్గురు పిల్లలు శివ (13), బిందు (16), దివిజ (8)లతో కలిసి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు మారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల కారణంగానే మనస్తాపానికి గురై సదరు మహిళ తన పిల్లలను తీసుకొని ఇల్లు వదిలి వెళ్లిపోయి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అదృశ్యమైన నలుగురి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్