గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చిత్ర విచిత్రంగా మారుతున్న నార్పల సర్పంచ్ రాజకీయాలు

1 గంట క్రితం

నారపాల
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 10:17 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఒకరికి నచ్చిన వారు మరొకరికి నచ్చకపోవడం సమన్వయ లోపమా, సమాచార లోపమా

ప్రజాశక్తి-నార్పల: మండల కేంద్రమైన నార్పల మేజర్ పంచాయితీ సర్పంచ్ రాజకీయం రోజుకు ఒక విధంగా మలుపు తిరుగుతూ చిత్రవిచిత్రంగా మారుతోంది నామినేషన్ల గడువు ముగిసే లోపు మరెన్ని మలుపులు తిరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరు తెరపైకొస్తోంది గ్రామాభివృద్ధి కోసం అందరి సమన్వయంతో ఆమోదయోగ్యమైన అభ్యర్థిని నిలుపుతారని ముందు నుంచి మండల వ్యాప్తంగా ప్రచారం సాగింది ఉమ్మడి అభ్యర్థిగా గవ్వల సుబ్బయ్యను సర్పంచ్ బరిలో నిలుపుతున్నారని సుబ్బయ్య నే బరిలో ఉంటాడని అందరూ భావించారు ఆఖరి క్షణంలో మైనార్టీ వర్గానికి చెందిన జాఫర్ వలి ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉంటాడని తెరపైకి రావడం సమన్వయ లోపమో సమాచార లోపమో మొత్తానికి ఏకాభిప్రాయం రాకపోవడంతో ఒకవైపు సుబ్బయ్య మరొకవైపు జాఫర్ వలి స్వతంత్ర అభ్యర్థిగా గవ్వల రమాదేవి బరిలో నిలుస్తారని త్రిముఖ పోటీ ఉంటుందని అందరూ భావించారు అయితే ఎవరు ఊహించని విధంగా సుబ్బయ్య, జాఫర్ వలి పోటీ నుండి తప్పుకోవడం ఎవరి మద్దతు లేకపోయినా గ్రామ అభివృద్ధి కోసం తాము ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉంటామంటూ ముందు నుంచి ఏర్పాట్లు చేసుకుంటున్నా మొరుసు సంజీవరెడ్డి భార్య గవ్వల రమాదేవి ఆకుల వర్గం అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది పంచాయతీ ఎన్నికలకు పార్టీల గుర్తులు లేకపోయినప్పటికీ పార్టీ ప్రతిపాదిత అభ్యర్థులు బరిలో ఉండడం సర్వసాధారణం నార్పల మేజర్ పంచాయతీకి తెలుగుదేశం అభ్యర్థిగా విజయభాస్కర్ వైసిపి అభ్యర్థిగా అమిర్ భాష పేర్లు తెరపైకి వచ్చాయి అయితే అభ్యర్థులను బరిలో నిలుపుతారా లేకపోతే అంతర్గతంగా బరిలో ఉన్నవారికే మద్దతు ఇస్తారా అని మండల వ్యాప్తంగా చర్చ జరుగుతోంది రాజకీయాలంటే ఇలాగే ఉంటాయా రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు వారు వీరు కావచ్చు వీరు వారు కావచ్చు అన్న నానుడి నిజమేనా అంటూ పలువురుచర్చించుకుంటున్నారు.

పైసలే రాజకీయాలను శాసిస్తున్నాయా.. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామస్థాయి నుండి దేశ స్థాయి వరకు పైసలే రాజకీయాలను శాసిస్తున్నాయని పలువురు అంటుండగా ప్రజాస్వామ్య దేశంలో అన్ని పైసలతో సాధ్యం కాదని ప్రజల తీర్పే అంతిమ తీర్పు అని పైసలతోనే అన్ని అవుతాయి అనడం సమంజసం కాదని పైసా ఖర్చు లేకుండా ఎన్నో ఉన్నత పదవులను అలరించిన వారు ఉన్నారు అని అబ్దుల్ కలాం, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, నీలం సంజీవరెడ్డి వంటి మహానీయులు లేరా అని అంటున్నారు.. డబ్బులు ఉన్నాయి కదా అని విచ్చలవిడిగా పంపిణీ చేసిన ఆర్థిక ఇబ్బందులతో డబ్బులు తీసుకున్నప్పటికీ ప్రజలు అనుకున్న వారికే ఓటు వేస్తారని దేశ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వంటి గొప్ప వ్యక్తులే ఓటు అనే వజ్రాయుధంతో ప్రజలు ఓడించారని అంతటివారే ప్రజా తీర్పును శిరోధార్యం అనక తప్పలేదు ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు అవుతారు.నార్పల మేజర్ పంచాయతీలో నార్పల ప్రజల తీర్పు ఎలా ఉంటుందో ఎవరెవరు బరిలో ఉంటారో నని మండల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్