ప్రజాశక్తి-కాకినాడ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక పురస్కారాలు–2026లో కాకినాడ శాఖకు అరుదైన గుర్తింపు లభించింది. పెద్ద శాఖల విభాగంలో రాష్ట్ర ఉత్తమ శాఖ అధ్యక్షుడిగా ఐఎంఏ కాకినాడ శాఖ అధ్యక్షుడు డా. కాదా వెంకటరమణ ఎంపికయ్యారు.శాఖ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడంలో చూపిన నాయకత్వ ప్రతిభ, వైద్య వృత్తి అభ్యున్నతికి, సామాజిక సేవా కార్యక్రమాలకు అందించిన విశేష కృషికి గుర్తింపుగా ఆయనకు ఈ పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా ఐఎంఏ కాకినాడ శాఖ సభ్యుల తరఫున కార్యదర్శి డా. ఎస్.సీహెచ్.ఎస్. రామకృష్ణ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ అవార్డుకు ఎంపిక కావడం కాకినాడ శాఖ సభ్యులందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.కాగా, తుఫాను కారణంగా వాయిదా పడిన ఐఎంఏ రాష్ట్ర మహాసభలు ఏపీకాన్–2026ను నవంబర్ 27, 28, 29 తేదీల్లో అమలాపురంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర గౌరవ ప్రధాన కార్యదర్శి డా. ఎం.ఎస్.సి. బోస్ వెల్లడించారు. ఈ మహాసభల్లో పురస్కార ప్రదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. అవార్డు ప్రదానానికి సంబంధించిన సవరించిన తేదీ, సమయాన్ని నిర్వాహకులు ఖరారు చేసిన అనంతరం ప్రకటించనున్నారు.
ఐఎంఏ రాష్ట్ర ఉత్తమ శాఖ అధ్యక్షుడిగా డా.కాదా వెంకటరమణ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 19, 2026, 10:35 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)