ముంబయి : అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు చోటు చేసుకుంటున్నాయనే వార్తలకు తోడు చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలను గడించాయి. బుధవారం బిఎస్‌ఇ సెన్సెక్స్ 299.17 పాయింట్లు లాభపడి 74,828 వద్ద నమోదయ్యింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 117.80 పాయింట్లు పెరిగి 23,446.80 వద్ద ముగిసింది. మెటల్, రియాల్టీ, ఎఫ్‌ఎంసిజి షేర్లు ప్రధానంగా మద్దతును ఇచ్చాయి. టాటాస్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఐటిసి షేర్లు అధికంగా లాభపడ్డాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 100 డాలర్ల దిగువకు పడిపోయి 99.06 డాలర్ల వద్ద ట్రేడింగ్ కాగా.. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.74గా ఉంది.
సెన్సెక్స్‌కు 300 పాయింట్ల లాభం
56 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 11:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)