గురువారం, 12 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనెలాఖరు నుంచి యుపిఐ చెల్లింపులపై ఛార్జీలు...!

17 గంటల క్రితం

జిఎస్‌‌టి వసూళ్లు రూ.2.31 లక్షల కోట్లు image 2
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 12:43 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : యుపిఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయడానికి నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌‌పిసిఐ) మళ్లీ కసరత్తును వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. రూ.2,000కు మించిన యుపిఐ వ్యాపార చెల్లింపులపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎమ్‌డిఆర్‌) విధించాలని మోడీ సర్కార్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 15 నుంచి ఈ రుసుములను అమలు చేయాలని తొలుత భావించిన ఎన్‌‌పిసిఐ దీపావళి నేపథ్యంలో నిర్ణయాన్ని వాయిదా వేసింది. పండుగ సీజన్‌ ముగియడంతో కొత్త తేదీని ఖరారు చేసే కసరత్తు జరుగుతోంది. నవంబర్‌ నెలాఖరుకు అమల్లోకి రావచ్చని రిపోర్టులు వస్తోన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావచ్చని సమాచారం. రూ.2,000లోపు వ్యాపార చెల్లింపులపై 0.4 శాతం ఎమ్‌డిఆర్‌ విధించాలని.. ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.300 పరిమితి ఉండాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్