mh ad
శనివారం, 20 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోర్షే ఉద్యోగుల్లో గుబులు..!

2 గంటల క్రితం

porsche
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 10:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

త్వరలో కొత్త పొదుపు ప్రణాళిక

ఫ్రాంక్‌ఫర్ట్ : ప్రముఖ జర్మన్ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ పోర్షే తన ఖర్చులను తగ్గించుకునే క్రమంలో రెండో విడత వ్యయ నియంత్రణ ప్యాకేజీని జులై నాటికి ఖరారు చేయాలని నిర్ణయించింది. ఫ్యాక్టరీ సెలవులకు ముందే ఉద్యోగ సంఘాలతో ఒప్పందం కుదుర్చుకుని.. సిబ్బందికి భవిష్యత్తుపై స్పష్టతనివ్వాలని సిఇఒ మైఖేల్ లైటర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారని తెలుస్తోంది. గతేడాది 2,000 మంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించిన కంపెనీ.. రాబోయే కొన్నేళ్లలో మరో 1,900 ఉద్యోగాలను తగ్గించాలని ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. దీంతో తాజా పొదుపు చర్యల ప్రకటనతో తమ ఉద్యోగాలు ఎక్కడ పోతాయోనని వారిలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.. ​అంతర్జాతీయ సుంకాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా 2026 మొదటి త్రైమాసికంలో లాభాలు తగ్గడంతో పోర్షే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. గత ఏడాది 2.8 లక్షల కార్లను విక్రయించిన సంస్థ ఇకపై తక్కువ ఉత్పత్తి సామర్థ్యంతోనే అధిక లాభాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో సోదర సంస్థ ఆడితో కలిసి పనిచేయడంతో పాటు, వ్యయాలను తగ్గించుకునే దిశగా వ్యూహాలను అమలు చేస్తోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్