చివరి వన్డేలో ఆప్ఘనిస్తాన్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపు
జైస్వాల్ సెంచరీ, రోహిత్ అర్ధ సెంచరీ
చెన్నై: మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 3-0తో చేజిక్కించుకొని క్లీన్‌స్వీప్ చేసింది. ఎం చిదంబరం స్టేడియం వేదికగా శనివారం జరిగిన చివరి వన్డేలో భారతజట్టు 9వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. తొలుత ఆఫ్ఘనిస్తాన్ జట్టును ప్రసిధ్ కృష్ణ కట్టడి చేయడంతో ఆ జట్టు 44.2ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. ఆ లక్ష్యాన్ని భారతజట్టు 28.4ఓవర్లలో కేవలం రోహిత్ శర్మ వికెట్ చేజార్చుకొని సునాయాసంగా ఛేదించింది. జైస్వాల్(110నాటౌట్), రోహిత్ శర్మ(79) సెంచరీ, అర్ధసెంచరీతో రాణించి మ్యాచ్‌ను ముగించారు. నామమాత్రమైన మ్యాచ్‌లోనైనా గెలవాలని చూసిన ఆఫ్ఘన్ ఆశల్ని ప్రసిధ్ కృష్ణ(5/23) ఆవిరి చేశాడు. ఆరంభంలోనే టాపార్డర్‌ను ప్రసిధ్ కృష్ణ పెవిలియన్ చేర్చి హడలెత్తించాడు. ప్రధాన ఆటగాళ్లు విఫలమైనా హష్మతుల్లా షాహిదీ(102) ఒంటరి పోరాటంతో జట్టును ఆదుకున్నాడు. అజ్మతుల్లా ఒమర్‌జాయ్(50)తో కలిసి దంచేసిన షాహిదీ వన్డేల్లో తొలి శతకంతో రెచ్చిపోయాడు. షాహిదీతో కలిసి స్కోర్ బోర్డును నడిపిస్తున్న అజ్మతుల్లాను ప్రిన్స్ యాదవ్ ఔట్ చేయడంతో.. మొహమ్మద్ నబీ(21) కాసేపు పోరాడాడు. కానీ, అతడిని గుర్నూర్ బ్రార్ బౌల్డ్ చేసి ఆరో వికెట్ అందించాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా షాహిదీ మాత్రం జోరు తగ్గించలేదు. వాషింగ్టన్ సుందర్ వేసిన 44వ ఓవర్లో బౌండరీతో తొలి శతకం అందుకున్నాడు. సెంచరీ బాదిన షాహిదీని ఔట్ చేసిన ప్రసిధ్ ఐదో వికెట్ ఖాతాలో వేసుకోగా.. అఫ్గనిస్థాన్ 218 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో బ్రార్, హర్ష్ దూబే చెరొక వికెట్ తీశారు. 219 పరుగుల ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(79)తో శతక భాగస్వామ్యం నెలకొల్పిన యశస్వీ.. వన్డేల్లో రెండో సెంచరీతో కదం తొక్కాడు. ఫలితంగా 28.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకున్న టీమిండియా 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. తొలి వికెట్‌కు శతక భాగస్వామ్యంతో భారత్‌ను విజయానికి చేరువ చేసిన ఈ ద్వయాన్ని నబీ విడదీశాడు. రోహిత్ ఔటైనా జోరు తగ్గించని యశస్వీ 29వ ఓవర్లో తొలి బంతిని స్టాండ్స్‌లోకి పంపి వన్డేల్లో రెండోసారి మూడంకెల స్కోరందుకున్నాడు. ఆ తర్వాత 4, సిక్సర్ బాదిన యశస్వీ.. శ్రేయస్ అయ్యర్(20 నాటౌట్)తో కలిసి గిల్ సేనకు 9 వికెట్ల విజయాన్ని కట్టబెట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్రసిధ్ కృష్ణకు, సిరీస్ శుభ్‌మన్ గిల్ కు దక్కాయి.
స్కోర్ బోర్డు...
ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి)రోహిత్ (బి)ప్రసిధ్ 5. ఇబ్రహీం జడ్రాన్ (సి)రోహిత్ (బి)ప్రసిధ్ 11, రామత్ షా (సి)రోహిత్ (బి)ప్రసిధ్ 5, హజ్మతుల్లా షాహిదీ (సి)శ్రేయస్ (బి)ప్రసిధ్ 102, రసూలీ (సి)శ్రేయస్ (బి)(బి)ప్రసిధ్ 1, ఒమర్జాయ్ (సి)ప్రసిధ్ (బి)ప్రిన్స్ యాదవ్ 50, మహ్మద్ నబీ (బి)గుర్నూర్ 21, రషీద్ ఖాన్ (సి)ప్రిన్ష్ యాదవ్ (బి)హర్ష్ దూబే 5, ఘజన్‌ఫర్ (నాటౌట్) గిల్/ఇషాన్ 0, రామన్ షరీఫీ (నాటౌట్) 1, అదనం 16, (44.2ఓవర్లలో ఆలౌట్) 218 పరుగులు. వికెట్ల పతనం: 1/5, 2/26, 3/28, 4/36, 5/141, 6/198, 7/205, 8/206, 9/206, 10/218 బౌలింగ్: గుర్నూర్ బ్రార్ 8-0-49-1, ప్రసిధ్ కృష్ణ 8.2-2-23-5, ప్రిన్ష్ యాదవ్ 7-0-38-1, నితీశ్ కుమార్ 6-0-42-0, హర్ష్ దూబే 7-0-38-1, సుందర్ 8-2-23-0
ఇండియా ఇన్నింగ్స్: జైస్వాల్ (నాటౌట్) 110, రోహిత్ శర్మ (సి)సెద్ధిఖుల్లా (బి)నబీ 79, శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 20, అదనం 15. (28.4ఓవర్లలో వికెట్ నష్టానికి) 224 పరుగులు.
వికెట్ల పతనం: 1/170
బబౌలింగ్: ఒమర్జాయ్ 2-0-26-0, రామన్ షరీఫీ 4-0-21-0, మాలిక్ 5-0-55-0, ఘజన్‌ఫర్ 3-0-15-0, రషీద్ ఖాన్ 7-0-53-0, నబీ 7.4-1-47-1.









కామెంట్‌లు (0)