కొనుగోలుకు సిసిఐ ఆమోదం
న్యూఢిల్లీ : భారతదేశంలోని డచ్ బ్యాంక్ రిటైల్, ప్రయివేటు బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్‌మెంట్ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం ద్వారా జర్మనీకి చెందిన డచ్ బ్యాంక్ తన భారత శాఖల ద్వారా నిర్వహిస్తున్న వినియోగదారుల ఆధారిత బ్యాంకింగ్ వ్యాపారాలను దేశీయ బ్యాంకుకు బదిలీ చేయనుంది. ఈ ఏడాది జూన్‌లో ఇరు బ్యాంకులు ఇందుకు సంబంధించి తుది ఒప్పందం కుదుర్చుకున్నాయి. మంగళవారం ఈ కొనుగోలుకు ఆమోదం తెలిపినట్లు సిసిఐ వెల్లడించింది. డచ్ బ్యాంక్ బదిలీ చేయనున్న వ్యాపారంలో సుమారు రూ.29,000 కోట్ల రుణాలు, రూ.16,000 కోట్ల డిపాజిట్లు, రూ.10,500 కోట్ల నిర్వహణలోని ఆస్తులు (ఎయుఎం) ఉన్నాయి.







కామెంట్‌లు (0)