mh ad
శనివారం, 20 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బస్సు ప్రయాణాల్లో ‘జెన్-జి’ హవా : రెడ్‌‌బస్‌

2 గంటల క్రితం

red bus
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 10:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో జూన్ 14 నుంచి 20 మధ్య బస్సు బుకింగ్‌లు గత ఏడాదితో పోలిస్తే 22 శాతం పెరిగే అవకాశం ఉందని రెడ్‌బస్ వెల్లడించింది. ఈ ప్రయాణీకుల్లో 18 నుంచి 30 ఏళ్ల జెన్-జీ యువతుల వాటా 48 శాతంగా ఉండటం విశేషమని పేర్కొంది. ముఖ్యంగా యువ మహిళా ప్రయాణీకుల వాటా 48 శాతంగా ఉండటం విశేషం. ప్రయాణీకులలో 65 శాతం మంది ఏసీ బస్సులకే మొగ్గు చూపుతుండగా, 58 శాతం మంది సుదూర ప్రయాణాలకు స్లీపర్ బస్సులను ఎంచుకుంటున్నారు. హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు వంటి ప్రధాన మార్గాల్లో రద్దీ ఎక్కువగా ఉందని.. యాత్రికుల సౌకర్యార్థం జూన్ 30 వరకు తిరుపతి ప్రయాణాలపై ప్రత్యేక కూపన్ కోడ్ ద్వారా రూ.500 వరకు రాయితీని అందిస్తున్నట్లు తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్