ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionత్వరలో మొబైల్‌ చార్జీల మోత

17 గంటల క్రితం

త్వరలో మొబైల్‌ చార్జీల మోత
మరో 15 శాతం పెరగొచ్చు
రెండేళ్లకోసారి 12 శాతం వడ్డన
అంబిట్‌ క్యాపిటల్‌ అంచనా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026, 08:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మరో 15 శాతం పెరగొచ్చు

  • రెండేళ్లకోసారి 12 శాతం వడ్డన

  • అంబిట్‌ క్యాపిటల్‌ అంచనా

​న్యూఢిల్లీ : మొబైల్‌ ఛార్జీలు మరోమారు పెరిగే అవకాశాలున్నాయని బ్రోకరేజీ సంస్థ అంబిట్‌ క్యాపిటల్‌ అంచనా వేసింది. దేశంలోని టెలికాం కంపెనీలు డిసెంబర్‌లో మొబైల్‌ టారిఫ్‌లను 15 శాతం పెంచవచ్చని ఓ నివేదికలో పేర్కొంది. అంతటితో ఆగకుండా రానున్న పదేళ్లలో ప్రతి రెండేళ్లకోసారి సుమారు 12 శాతం చొప్పున చార్జీలను పెంచే అవకాశముందని తెలిపింది. పెంపు అమలైతే రూ.200 మొబైల్‌ ప్లాన్‌ ధర రూ.230కి, రూ.300 ప్లాన్‌ రూ.345కు, రూ.500 ప్లాన్‌ రూ.575కు చేరుతుంది. ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న కుటుంబాలపై టెలికాం వ్యయం మరింత భారం కానుంది. దేశంలో మూడు ప్రధాన ప్రయివేటు టెలికాం కంపెనీలు కొనసాగాలన్న ప్రభుత్వ విధాన దృక్పథం కూడా టారిఫ్‌ల పెంపునకు అనుకూలంగా ఉండవచ్చని పేర్కొంది. ఇది సిండికేట్‌ పెంపునకు దోహదం చేస్తోందని స్పష్టమవుతోంది. ఇప్పటికే ఎయిర్‌టెల్‌ ఆగస్టులో రోజుకు 1.5 జిబి డేటా అందించే ప్రారంభ ప్లాన్‌ను తొలగించడంతోపాటు పోస్ట్‌పెయిడ్‌ చార్జీలను పెంచింది. ప్రారంభ ప్లాన్‌ తొలగింపు వల్ల ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ఎఆర్‌‌పియు) 4.4 శాతం పెరగవచ్చని అంచనా వేసింది. ​2025-26 నుంచి 2028-29 మధ్య ఎయిర్‌టెల్‌ ఆదాయం ఏటా సగటున 16 శాతం, జియో ఆదాయం 15 శాతం చొప్పున వృద్ధి చెందవచ్చని అంచనా వేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్