న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 తొలి ఆరు నెలల్లోనే లక్ష సోనాలిక ట్రాక్టర్ల విక్రయాలను నమోదు చేసి చారిత్రక మైలురాయిని సాధించినట్లు వెల్లడించింది. ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య ఈ విక్రయాలు నమోదయ్యాయని ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రామన్ మిట్టల్ తెలిపారు. గతంలో ఏడాది కాలంలో సాధించిన ఈ లక్ష్యాన్ని ఇప్పుడు కేవలం ఆరు నెలల్లోనే చేరుకున్నామన్నారు. పండుగ సీజన్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని హోషియార్‌పూర్ ప్లాంట్‌లో నెలకు రికార్డు స్థాయిలో 19 వేల ట్రాక్టర్ల ఉత్పత్తిని సాధించామని వెల్లడించారు.
ఆరు నెలల్లోనే సోనాలిక లక్ష ట్రాక్టర్ల విక్రయాలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 02, 2026, 08:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)