బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకాకినాడ నుంచి జపాన్‌కు హరిత అమ్మోనియా సరఫరా

17 గంటల క్రితం

కాకినాడ నుంచి జపాన్‌కు హరిత అమ్మోనియా సరఫరా
ఎఎం గ్రీన్‌ సంస్థతో జెరా ఒప్పందం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 08:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎఎం గ్రీన్‌ సంస్థతో జెరా ఒప్పందం

ప్రజాశక్తి - హైదరాబాద్‌ : జపాన్‌ ఇంధన సంస్థ జెరా (జెరా కో.) ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో హరిత అమ్మోనియా ప్లాంటును నిర్మిస్తున్న ఎఎం గ్రీన్‌ సంస్థతో దీర్ఘకాలిక సరఫరా ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం 2028–29 నుంచి ఐదేళ్లపాటు ఏటా సుమారు 70 వేల టన్నుల హరిత అమ్మోనియాను జెరాకు సరఫరా చేయనున్నారు. జపాన్‌లోని హెక్కినాన్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం వద్ద ఏర్పాటు చేస్తున్న నిల్వ, స్వీకరణ సదుపాయాల ద్వారా సముద్ర రవాణాలో ఉపయోగించే అమ్మోనియా ఇంధన నౌకలకు ఈ ఇంధనాన్ని అందించనున్నారు. ఈ ఒప్పందం జపాన్‌ ఇంధన భద్రతకు తోడ్పడటంతో పాటు సముద్ర రవాణాలో కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలకు దోహదపడుతుందని ఎఎం గ్రీన్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కొల్లి తెలిపారు. జపాన్‌ డీకార్బనైజేషన్‌ లక్ష్యాలు, పారిశ్రామిక అవసరాలకు ఈ సరఫరా గొలుసు కీలకమని జెరా సీనియర్‌ మేనేజింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఇర్తిజా సయ్యద్‌ పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్