న్యూఢిల్లీ : దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగిపోతోంది. ఈ ఏడాది డిసెంబర్లో క్రెడిట్ కార్డుల వ్యయాలు సుమారు రూ.2.45 లక్షల కోట్లకు చేరాయి. ఇదే సమయంలో డెబిట్ కార్డుల కొనుగోళ్లు రూ.40,492 కోట్లకు పరిమితం కావడం విశేషం. క్రెడిట్ కార్డు ఖర్చులు డెబిట్ కార్డు కొనుగోళ్ల కంటే దాదాపు ఆరు రెట్లు అధికంగా నమోదయ్యాయి. అదే సమయంలో ఎటిఎంలు, పిఒఎస్ కేంద్రాల ద్వారా నగదు ఉపసంహరణలు రూ.2.33 లక్షల కోట్లకు పైగా నమోదయ్యాయి. క్రెడిట్ కార్డు ఖర్చుల్లో ఆన్లైన్ లావాదేవీల వాటా రూ.1.54 లక్షల కోట్లు కాగా, భౌతిక పిఒఎస్ కేంద్రాల వద్ద రూ.90,562 కోట్ల కొనుగోళ్లు జరిగాయి. డెబిట్ కార్డుల ద్వారా పిఒఎస్ కొనుగోళ్లు రూ.24,957 కోట్లు, ఆన్లైన్ ఖర్చులు రూ.15,284 కోట్లుగా నమోదయ్యాయి. డెబిట్ కార్డుల ద్వారా ఎటిఎంల వద్ద 42.04 కోట్ల లావాదేవీలలో రూ.2.32 లక్షల కోట్లకు పైగా నగదు ఉపసంహరించారు. డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నప్పటికీ, రోజువారీ ఆర్థిక లావాదేవీల్లో నగదు వినియోగం ఇంకా భారీగానే కొనసాగుతున్నట్లు ఆర్బిఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
క్రెడిట్ కార్డులను గీకేస్తున్నారు..!
9 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 27, 2026, 12:22 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)