ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మళ్లీ చమురు మంటలు

22 గంటల క్రితం

మళ్లీ చమురు మంటలు
మూడు వారాల పతనానికి బ్రేక్‌.. image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 08:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మూడు వారాల పతనానికి బ్రేక్‌..

న్యూఢిల్లీ : ​పశ్చిమాసియాలో ఇంధన మౌలిక వసతులు, వాణిజ్య నౌకలపై దాడులు మళ్లీ పెరగడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో సరఫరా ఆందోళనలు తీవ్రమయ్యాయి. హర్మూజ్‌ జలసంధి వద్ద అంతరాయాలు ముడిచమురు ధరలకు ఆజ్యం పోస్తోన్నాయి. నవంబర్‌ 27న బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 95.44 డాలర్ల వద్ద ముగిసింది. రోజులో 1.2 శాతం తగ్గినప్పటికీ.. వారంలో సుమారు 3 శాతం పెరిగింది. దీంతో వరుసగా మూడు వారాల పతనానికి బ్రేక్‌ పడింది. అమెరికా డబ్ల్యుటిఐ క్రూడ్‌ 83.08 డాలర్ల వద్ద ముగిసింది. యుద్ధానికి ముందు స్థాయితో పోలిస్తే నవంబర్‌ 25తో ముగిసిన వారంలో హర్మూజ్‌ జలసంధి ద్వారా చమురు రవాణా 55 శాతానికి పడిపోయింది. సరఫరా అంతరాయాలపై ఆందోళనలు పెరగడంతో ధరలు తిరిగి పెరుగుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్