బుధవారం, 05 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

RBI: గరిష్ఠ స్థాయికి ద్రవ్యోల్బణం

1 గంట క్రితం

rbi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 10:32 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- రెపోరేటు యథాతథం

- ఆర్‌బీఐ గవర్నర్

ముంబై: ఆహార, ఇంధన ధరల ప్రభావంతో మూడో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా హెచ్చరించారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రెపోరేటును 5.25 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్ బుధవారం ద్రవ్య విధాన సమీక్షను ప్రకటించారు. పాలసీ రేటుపై తటస్థ వైఖరిని కొనసాగిస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీ రేటులో ఎలాంటి మార్పులు చేయకూడదని ఎంపీసీ అభిప్రాయపడిందని గవర్నర్ తెలిపారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై స్పందించిన ఆయన, పశ్చిమ ఆసియా సంఘర్షణ కీలక వాణిజ్య మార్గాలపై ప్రభావం చూపుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసురుతోందన్నారు. అంతర్జాతీయ పరిణామాలు, సరఫరా వ్యవస్థలో నెలకొంటున్న అంతరాయాలు ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే, 2027 ఆర్థిక సంవత్సరానికి భారత వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. ఇది గత అంచనాతో పోలిస్తే 10 బేసిస్ పాయింట్లు ఎక్కువ. లోటు వర్షపాతం, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, పశ్చిమ ఆసియా పరిస్థితులు దేశ ఆర్థిక దృక్పథంపై అనిశ్చితిని కొనసాగిస్తున్నాయని ఆర్‌బీఐ పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్