శనివారం, 21 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రెండేళ్ల కనిష్టానికి బిట్‌కాయిన్‌

4 గంటల క్రితం

రెండేళ్ల కనిష్టానికి బిట్‌కాయిన్‌
55,830 డాలర్లకు క్షీణత image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 09:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- 55,830 డాలర్లకు క్షీణత

వాషింగ్టన్‌ : ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌ రెండేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఎఐ కంపెనీల షేర్ల విలువలు అధికంగా ఉన్నాయనే ఆందోళనలు పెట్టుబడిదారుల్లో పెరగడంతో రిస్క్‌ ఆధారిత ఆస్తుల నుంచి అమ్మకాలు వెల్లువెత్తాయి. శుక్రవారం అమెరికా మార్కెట్‌ సమయంలో బిట్‌కాయిన్‌ 5.10 శాతం క్షీణించి 55,830 డాలర్ల (దాదాపు రూ.52 లక్షలు)కు పడిపోయింది. ఇది 2024 సెప్టెంబర్‌ తర్వాత నమోదైన అత్యల్ప స్థాయి. అంతకుముందు బిట్‌కాయిన్‌ 3.57 శాతం తగ్గి 56,813.68 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. గత కొన్ని రోజులుగా క్రిప్టో మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరుగుతోంది. ఎఐ మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు వాటి లాభదాయకతను సాధిస్తాయా అనే సందేహాలు, రుణ వ్యయాలు పెరగడం, నియంత్రణపరమైన అనిశ్చితులు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల విజయంతో నియంత్రణ విధానాల్లో మార్పులపై ఆందోళనలు కూడా క్రిప్టో మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. గతేడాది అక్టోబర్‌లో బిట్‌ ‌కాయిన్‌ ‌విలువ 1,25,000 డాలర్ల (రూ.1.15 కోట్లు) గరిష్ట స్థాయికి చేరింది. ఈ ఏడాది క్రమంగా పడిపోవడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్