శనివారం, 14 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌..

8 గంటల క్రితం

Stock markets in the red... Tata shares fall...!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 09:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సెన్సెక్స్‌ 319 పాయింట్లు పతనం..

ముంబయి : ​దేశీయ స్టాక్‌ మార్కెట్ల మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ ‌పడింది. ముడిచమురు ధరల పెరుగుదల, బంగారం ధరల తగ్గుదల, కీలక కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడితో గురువారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 319 పాయింట్లు లేదా 0.39 శాతం తగ్గి 81,592కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ నిఫ్టీ 155 పాయింట్లు లేదా 0.61 శాతం క్షీణించి 25,144 వద్ద ముగిసింది. నిఫ్టీ-50లో 39 షేర్లు నష్టాల్లో ముగియగా.. 18 షేర్లు ఒక శాతానికిపైగా పడిపోయాయి. ముడిచమురు ధరలు పెరగడంతో పెయింట్‌, విమానయాన, చమురు మార్కెటింగ్‌ కంపెనీల షేర్లపై ఒత్తిడి నెలకొంది. ఇండిగో ఒక శాతం, హెచ్‌పిసిఎల్‌ రెండు శాతం తగ్గాయి. బంగారం ధరలు పడిపోవడంతో ముత్తూట్‌ ఫైనాన్స్‌, మణప్పురం ఫైనాన్స్‌ షేర్లు మూడు శాతం చొప్పున క్షీణించాయి. టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ మూడు శాతం, గ్రాసిమ్‌ రెండు శాతానికిపైగా, వొడాఫోన్‌ ఐడియా మూడు శాతం నష్టపోయాయి. మరోవైపు హిటాచీ ఎనర్జీ 11 శాతం, అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 9 శాతం, పిబి ఫిన్‌టెక్‌ ఐదు శాతం చొప్పున పెరిగాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్