సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఐటి, ఎఫ్‌ఎంసిజి షేర్లు డీలా..

1 గంట క్రితం

sada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 09:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సెన్సెక్స్‌ 548 పాయింట్లు పతనం

- 22,363కు దిగజారిన నిఫ్టీ..

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఐటి, ఎఫ్‌ఎంసిజి రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 548 పాయింట్లు పతనమై 71,925కు పరిమితమయ్యింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 157 పాయింట్లు కోల్పోయి 22,363 వద్ద ముగిసింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఇంట్రాడే గరిష్ఠ స్థాయి నుంచి సెన్సెక్స్‌ ఏకంగా 1,208 పాయింట్లు పడిపోవడం మార్కెట్లలో అమ్మకాల తీవ్రతకు అద్దం పట్టింది. ఒక దశలో అమ్మకాల ఒత్తిడితో 71,676 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ప్రధానంగా ఐటి, ఎఫ్‌ఎంసిజి షేర్లతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు, చమురు, గ్యాస్‌ కంపెనీల షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్‌-30లో ఐటిసి, టెక్‌ మహీంద్రా, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, ఎల్‌అండ్‌టి, ఎస్‌బిఐ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. మరోవైపు బిఇఎల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అధిక స్థాయిలో కొనసాగుతుండటం కూడా ఇన్వెస్టర్లకు ఆందోళన కలిగిస్తోంది. క్రూడ్‌ బ్యారెల్‌ ధర 105 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 4,174 డాలర్ల వద్ద ట్రేడింగ్‌ అయ్యింది. డాలరుతో రూపాయి మారకం విలువ 95.75 వద్ద నమోదయ్యింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్