సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఢిల్లీ హైకోర్టు న్యాయవాదుల నిరసన

53 నిమిషాల క్రితం

ఢిల్లీ హైకోర్టు న్యాయవాదుల నిరసన
- నల్ల రిబ్బన్లు, రాజ్యాంగ పఠనం
- పోలీసుల దాడికి ఖండన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 10:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- నల్ల రిబ్బన్లు, రాజ్యాంగ పఠనం

- పోలీసుల దాడికి ఖండన

న్యూఢిల్లీ : న్యాయవాదులపై పోలీసుల చర్యకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు న్యాయవాదులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. నల్ల రిబ్బన్లు ధరించి, రాజ్యాంగ పఠనం చేసిన తమ నిరసనను వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ హైకోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది న్యాయవాదులు పాల్గొన్నారు. ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ (డిహెచ్‌‌సిబిఎ) పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఉదయం నుంచే ఈ కార్యక్రమానికి న్యాయవాదులు తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది రాజశేఖర్ రావు రాజ్యాంగ పీఠికలోని సూత్రాలను గుర్తుచేస్తూ ఒక కవితను వినిపించారు. ‘‘మనం స్వీకరించిన రాజ్యాంగం ఇప్పుడు రద్దయిపోయినట్లుగా కనిపిస్తోంది’’ అని తెలిపారు. అనంతరం వారంతా రాజ్యాంగ పీఠికను చదివారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది స్వాతి సింగ్ మాలిక్ కూడా పాల్గొన్నారు. శనివారం జంతర్ మంతర్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న స్వాతి సింగ్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, బలవంతంగా పోలీస్ వ్యాన్‌లోకి ఎక్కించిన దృశ్యాలు సోషల్‌ ‌మీడియాలో వైరల్‌‌గా మారిన సంగతి తెలిసిందే. పోలీసులు ఆమె చేతిలో రాజ్యాంగ పీఠికను కూడా లాక్కొని చింపివేశారు. అలాగే, సీనియర్ న్యాయవాది షాదన్ ఫరాసత్‌ను కూడా ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై దాడి చేసి, ఈడ్చుకెళ్లినట్లు తోటి న్యాయవాదులు విమర్శిస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌‌లో పిటిషనర్ల తరఫున ఫరాసత్ వాదనలు వినిపిస్తున్నారు. అలాగే, మరో సీనియర్ న్యాయవాది దినేష్ ద్వివేదిను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసుల తీరును న్యాయవాదులు ఖండించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్