సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అక్రమ నిర్భంధాలపై సుప్రీంకోర్టుకు ఎంపి రహీమ్‌

1 గంట క్రితం

rahim
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 09:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‌న్యూఢిల్లీ : ఈ నెల 11న ఢిల్లీలో ప్రశాంతంగా ఆందోళనలు చేస్తున్న వారిని అక్రమంగా నిర్భంధించడం, రహస్యంగా తరలించడం, కస్టడీలో హింసించడం. వంటి చర్యలకు వ్యతిరేకంగా రాజ్యసభ ఎంపి ఎ.ఎ. రహీమ్ సోమవారం నాడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆదివారం ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఆందోళన చేస్తున్న డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డివైఎఫ్‌ఐ) కార్యవర్గ సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు, కార్యకర్తలపై పోలీసులు పై చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై న్యాయవాది సుభాష్ చంద్రన్ కె.ఆర్. ద్వారా రహీమ్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. ఇలాంటి విషయాల్లో అధికారిక ప్రకటన, అనుసరించాల్సిన మార్గదర్శకాలు, స్వతంత్ర విచారణ, కేంద్ర ప్రభుత్వం నుండి పరిహారంను రహీమ్‌ కోరారు. కేంద్ర హోం శాఖను ప్రతివాదిగా చేర్చారు. కార్యకర్తలపై హింసకు బాధ్యులైన అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా పిటిషన్‌‌లో ఎంపి కోరారు. ఈ పోలీసుల దుశ్చర్య అనేది ఏదో యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాదని, శారీరక హింసకు పాల్పడే ఉద్దేశంతోనే ప్రణాళికాబద్ధంగా, ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని ఎంపి పేర్కొన్నారు. ‘అరెస్టు మెమో తయారు చేయలేదని, అరెస్టుకు గల కారణాలను కూడా వెల్లడించలేదు. ఏ నిర్బంధితుడికి వైద్య పరీక్షలు చేయలేదు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదు’ అని ఎంపి పిటీషన్‌‌లో పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్