సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

థియేటర్ల కోసం పూర్తి ఎఐ సినిమాలు

1 గంట క్రితం

థియేటర్ల కోసం పూర్తి ఎఐ సినిమాలు
- గ్యాలరీ5 ఎఐ స్టూడియో దృష్టి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 09:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- గ్యాలరీ5 ఎఐ స్టూడియో దృష్టి

ప్రజాశక్తి - హైదరాబాద్‌ : కృత్రిమ మేధ (ఎఐ) ఆధారంగా పూర్తి నిడివి సినిమాల నిర్మాణానికి అవసరమైన సాంకేతికతపై గ్యాలరీ5 ఎఐ స్టూడియో దృష్టి సారించింది. కలెక్టివ్‌ ఆర్టిస్ట్స్‌ నెట్‌వర్క్‌లో భాగమైన ఈ సంస్థ హైదరాబాద్‌లో నిర్వహించిన ఎన్‌ఎక్స్‌టీ ఇన్‌ ఎఐ’ కార్యక్రమంలో ఎఐ ఆధారిత చిత్ర నిర్మాణ విధానాలను ప్రదర్శించింది. ఇందులో 4కె దృశ్యాల రూపకల్పన, విజువల్‌ ఎఫెక్ట్స్‌, ఎఐ పాత్రల సృష్టి వంటి సాంకేతికతలను పరిచయం చేసింది. ఎఐని వృత్తిపరమైన చిత్ర నిర్మాణంలో వినియోగించడంపై దృష్టి సారిస్తున్నట్లు కలెక్టివ్‌ ఆర్టిస్ట్స్‌ నెట్‌వర్క్‌ గ్రూప్‌ సిఇఒ విజయ్‌ సుబ్రమణ్యం, గ్యాలరీ5 సిఇఒ రాహుల్‌ రెగులపాటి తెలిపారు. భారీ స్థాయి సినిమాల నిర్మాణానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు రాహుల్‌ రెగులపాటి పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్