ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా తీవ్ర ఒడిదొడుకులకు లోనైనా.. చివరి గంటల్లో కోలుకుని లాభాలను నమోదు చేశాయి. ఇటీవల జరిగిన ముహూర్త ట్రేడింగ్‌లో స్వల్ప నష్టాలను చవిచూసిన మార్కెట్లు.. తిరిగి లాభాల బాట పట్టాయి. దీంతో నిఫ్టీ మరోసారి 25 వేల పాయింట్ల కీలక స్థాయిని అధిగమించింది.
బీఎస్‌ఈ సెన్సెక్స్ గత ముగింపు 80,999.40 పాయింట్లతో పోలిస్తే.. ఉదయం 81,327.29 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. అయితే కొద్దిసేపటికే నష్టాల్లోకి వెళ్లి, రోజంతా లాభనష్టాల మధ్య కదలాడింది. ఇంట్రాడేలో 80,519.31 నుంచి 81,339.41 పాయింట్ల మధ్య ట్రేడైంది. చివరకు 107.25 పాయింట్లు పెరిగి 81,106.65 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 58.25 పాయింట్లు లాభపడి 25,044.65 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.93.93గా నమోదైంది.
సెన్సెక్స్‌లోని 30 ప్రధాన కంపెనీల్లో ఎస్‌బీఐ, ట్రెంట్, ఎల్‌అండ్‌టీ, ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాలను నమోదు చేశాయి. మరోవైపు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాలతో ముగిశాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 97 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు ధర 4,098 డాలర్లుగా నమోదైంది.







కామెంట్‌లు (0)