గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మందకోడిగా ఎన్‌ఎస్‌ఇ లిస్టింగ్‌

1 గంట క్రితం

nse
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 09:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- షేర్లు 0.94 శాతమే పెరుగుదల

ముంబయి : నేషనల్‌ ‌స్టాక్‌ ఎక్సేంజీ (ఎన్‌ఎస్‌ఇ) లిస్టింగ్‌ ‌తొలిరోజే మందకోడిగా ట్రేడింగ్‌ అయ్యింది. ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్‌ఎస్‌ఇ గురువారం స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. రూ.1,785 ఐపిఒ ఇష్యూ ధరతో పోలిస్తే 0.8 శాతం ప్రీమియంతో ప్రారంభమైన ఎన్‌ఎస్‌ఇ షేర్లు బిఎస్‌ఇలో తుదకు 0.94 శాతం లాభంతో రూ.1,817 వద్ద ముగిశాయి. రూ. 26,000 కోట్ల విలువైన ఈ ఐపిఒకు సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి దాదాపు 12 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. లిస్టింగ్‌ సాధారణంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలిక వృద్ధిపై సానుకూల అంచనాలున్నాయని ఎన్‌ఎస్‌ఇ ఎండి అండ్‌ ‌సిఇఒ ఆశిష్‌కుమార్ చౌహాన్ తెలిపారు. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఎన్‌ఎస్‌ఇ షేర్లు 5 శాతానికి పైగా పెరగడంతో పాటుగా మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలోని అత్యంత విలువైన టాప్-10 కంపెనీల ప్రతిష్టాత్మక క్లబ్‌లోకి ప్రవేశించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్