గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జర్మనీలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు కేరళ వాసులు మృతి

1 గంట క్రితం

Germany
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 04:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బెర్లిన్‌ : జర్మనీలో ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు కేరళ వాసులు మరణించారు. బోచుమ్‌లోని హాఫ్‌స్టెడ్ జిల్లాలో ఉన్న ఒక బహుళ అంతస్తుల భవనంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 4.15 గంటల ప్రాంతంలో అత్యవసర సేవలకు సమాచారం అందింది. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. రెండో అంతస్తులోని ఒక అపార్ట్‌మెంట్‌లో ముగ్గురి మృతదేహాలను గుర్తించామని, పొగ పీల్చడంతో అస్వస్థతకు గురైన మరో ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు.

మృతులను కొల్లం జిల్లాకు చెందిన అంజలి షీలా జాయ్‌, ఎర్నాకులానికి చెందిన సివిన్‌ జానీ, ఇడుక్కికి చెందిన నోవాసాబులుగా గుర్తించినట్లు తెలిపారు. మృతదేహాలను కేరళకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టిందని పర్యాటక శాఖ మంత్రి పి.సి.విష్ణునాథ్‌ తెలిపారు. అధికారులు నోర్కా, భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు. అయితే, ఉద్దేశపూర్వకంగా భవనానికి నిప్పుపెట్టారా లేదా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయా అనే విషయంపై దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. హత్యకు పాల్పడ్డారన్న అనుమానంతో అదే భవనంలో నివసిస్తున్న 41ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్