విజయవాడ : మహిళల అభ్యున్నతిపై దృష్టి కేంద్రీకరించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. గురువారం పున్నమిఘాట్లో జాతీయ సరస్ మేళా ప్రారంభోత్సవం సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ ... ఉపాధి కల్పనను దాటి, లాభదాయకమైన, స్థిరమైన, విస్తరించదగిన మహిళా పారిశ్రామిక సంస్థలను నిర్మించడంపై దృష్టి సారించాలన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు తగిన ఆర్థిక వసతులు, ఆధునిక సాంకేతికత, డిజిటల్ ప్లాట్ఫారమ్లు, బ్రాండింగ్, ప్యాకేజింగ్, నాణ్యతా ప్రమాణాలు పెంచుకోవాలని సూచించారు. నమ్మకమైన మార్కెట్ అనుసంధానాలు కల్పించడం ద్వారా వారి వ్యాపారాలను విస్తరించుకోవడానికి విస్తృత మార్కెట్లలో పోటీ పడేలా మద్దతునివ్వాలని సూచించారు. స్తృత మార్కెట్లలో పోటీ పడేలా మద్దతునివ్వాలని అన్నారు. ఈ సరస్ మేళా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శన ఎంతో మందికి మంచి అవకాశాలు కలిగిస్తుందని గవర్నర్ తెలిపారు. కేవలం సందర్శకుల సంఖ్య ఆధారంగానే కాకుండా, వ్యాపార అవకాశాలు, మార్కెట్ సంబంధాలు, వృద్ధి సామర్థ్యం, స్థిరమైన ఉపాధి అవకాశాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ‘సరస్ ఆజీవిక మేళా’ వంటి కార్యక్రమాలు గ్రామీణ ఉత్పత్తిదారులకు పట్టణ వినియోగదారులకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చగలవన్నారు. మహిళల్లో పెట్టుబడి పెట్టడం అంటే బలమైన కుటుంబాలు, సమ్మిళిత సమాజాలు మరింత సుసంపన్నమైన దేశంలో పెట్టుబడి పెట్టడమేనన్నారు. మహిళా సాధికారత అంటే మహిళలను బలవంతులుగా మార్చడం కాదని... మహిళలు ఇప్పటికే బలంగా ఉన్నారని... ప్రపంచం ఆ బలాన్ని చూసే విధానాన్ని మార్చడమే సాధికారత అనే విషయాన్ని గుర్తించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.
మహిళల అభ్యున్నతి పై దృష్టి కేంద్రీకరించాలి : గవర్నర్ అబ్దుల్ నజీర్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 15, 2026, 03:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)