విజయవాడ : ఇది కేవలం మేళా కాదు.. 365 రోజులూ మార్కెట్ ఏర్పాటుకు అవకాశం అని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలోని కృష్ణా తీరాన జాతీయ సరస్ మేళాను రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం.. ప్రతి ఆడబిడ్డకు ఒక సందేశమని అన్నారు. మహిళలకు సంకల్పం ఉంటే ఎలాంటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహిస్తారని ముర్ము నిరూపించారన్నారు. ఇది నారీ శక్తి, నవభారత్ శక్తి, వికసిత్ భారత్కు పునాది అని చెప్పారు. సరస్ మేళా గురించి మాట్లాడుతూ.. ఇది కేవలం మేళా కాదు.. 365 రోజులూ మార్కెట్ ఏర్పాటుకు అవకాశం అని చెప్పారు. గ్రామీణ మహిళల ఆదాయం పెంచడం, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం మేళా లక్ష్యం అని అన్నారు. కొత్త వ్యాపారాలకు అవకాశాలు సృష్టించాలన్నారు. నిన్నటి పొదుపు సంఘాలు.. నేటి వ్యాపార సంస్థలు.. రేపటి అంతర్జాతీయ బ్రాండ్లు కావాలి అని చంద్రబాబు కోరారు.
ఇది 365 రోజులూ మార్కెట్ ఏర్పాటుకు అవకాశం : సిఎం చంద్రబాబు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 15, 2026, 04:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)