న్యూఢిల్లీ : వెనిజులాలోని సాన్ క్రిస్టోబల్, కారాబోబో చమురు ప్రాజెక్టుల నిర్వహణ హక్కులను దక్కించుకునేందుకు ఓఎన్‌జిసి విదేశ్ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. రానున్న మూడు నుంచి ఆరు నెలల్లో ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉందని సంస్థ వర్గాలు భావిస్తున్నాయి. సాన్ క్రిస్టోబల్ ప్రాజెక్టులో ఓఎన్‌జీసీ విదేశ్‌కు 40 శాతం వాటా ఉండగా, మిగిలిన మెజారిటీ వాటా వెనిజులా ప్రభుత్వ చమురు సంస్థ పెట్రోలియోస్ డి వెనిజులా (పిడివిఎస్‌ఎ) వద్ద ఉంది. ఈ ప్రాజెక్టుల నిర్వహణ హక్కులపై చర్చలు పురోగతిలో ఉన్నాయని, త్వరలో స్పష్టత వస్తుందని ఒఎన్‌జిసి డైరెక్టర్ (ఫైనాన్స్) అనుపమ్ అగర్వాల్ తెలిపారు.
వెనిజులా చమురుపై ఒఎన్‌జిసి దృష్టి
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 07, 2026, 09:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)