- విజేతలకు అభినందనలు తెలిపిన మంత్రి డా.స్వామి
ప్రజాశక్తి - ప్రకాశం (తూర్పు నాయుడుపాలెం): స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయంతో తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు, కార్యకర్తలు మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామిని కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి ఆదివారం భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ మంత్రి వారికి అభినందనలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ...మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కూటమికి తిరుగులేని విజయాన్ని అందించి అభివృద్ధికి పట్టం కట్టారన్నారు. ఇది ప్రజా విజయమని, ప్రజలు సీఎం చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వంపై నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి మరింత పాటుపడతామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన వారు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఈ సందర్భంగా సూచించారు.








కామెంట్‌లు (0)