హైదరాబాద్ : పేటీఎం, ఛార్జ్‌జోన్ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా 1,200కు పైగా ఛార్జ్‌జోన్ ప్రాంతాల్లోని 15,000కు పైగా హైస్పీడ్ ఈవీ ఛార్జింగ్ పాయింట్ల వద్ద పేటియం క్యూఆర్ చెల్లింపులు అందుబాటులోకి రానున్నాయి. ఛార్జింగ్ సేవల కోసం ఛార్జ్‌ఇండియా అగ్రిగేటర్ అనుసంధానంతో వినియోగదారులు చెల్లింపులను సులభంగా నిర్వహించవచ్చు. ఛార్జింగ్ ప్రక్రియలో చెల్లింపుల సౌలభ్యం పెంచడం ఈ భాగస్వామ్యం లక్ష్యమని ఛార్జ్‌జోన్ సీఈఓ కార్తికేయ హరియాని పేర్కొన్నారు.
ఈవీ ఛార్జింగ్ కేంద్రాల్లో పేటీఎం చెల్లింపులు
55 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 23, 2026, 09:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)