సెన్సెక్స్ 1,045 పాయింట్లు పతనం
2300 దిగువకు నిఫ్టీ
వడ్డీ రేట్ల భయం, చమురు సెగకు రూ.10 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలా యి. అమ్మకాల సునామీ కొనసాగడంతో గురువారం ఒక్కరోజులోనే రూ.10 లక్షల కోట్ల పైగా మదుపర్ల సంపద తుడుచుకుపెట్టు కుపోయింది. భారత రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడం, ముడిచమురు ధరలు భగ్గుమనడం, అంతర్జాతీయ బాండ్ రాబడులు పెరగడం, దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రతికూలతలు వెరసి దలాల్ స్ర్టీట్‌ను కుదుపునకు గురి చేశాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ నిధులు వరుసగా తరలిపోతుండటం మార్కెట్‌పై విశ్వాసాన్ని దెబ్బతీసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే గురువారం సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పతనం కాగా.. నిఫ్టీ ఓ దశలో 52 వారాల కనిష్ఠానికి పడిపోయింది. తుదకు బిఎస్‌ఇ సెన్సెక్స్ 1,045 పాయింట్లు లేదా 1.44 శాతం క్షీణించి 71,593కు పరిమితమయ్యింది. ఇంట్రాడేలో ఒక దశలో ఏకంగా 1,310 పాయింట్లు పడిపోయి 71,328 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 371 పాయింట్లు లేదా 1.64 శాతం నష్టపోయి 22,232 వద్ద ముగిసింది. ఓ దశలో నిఫ్టీ 423 పాయింట్లు కోల్పోయి 22,179.90 వద్ద 52 వారాల కనిష్టాన్ని చవి చూసింది. బిఎస్‌ఇలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాపిటలైజేషన్ రూ.10.2 లక్షల కోట్లు ఆవిరై రూ.460.97 లక్షల కోట్లకు పడిపోయింది. వరుస నష్టాలతో మదుపర్లు బెంబేలెత్తుతున్నారు. రిటైల్ ఇన్వెస్టర్ల ఇన్వెస్టర్ల పరిస్థితి దారుణంగా మారిందని వారు వాపోతున్నారు. గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, నౌకలపై దాడులు ముడిచమురు సరఫరాపై ఆందోళనలను పెంచాయి. ఫలితంగా ట్రేడింగ్‌లో క్రూడ్ ధరలు 2 శాతానికి పైగా పెరిగి చమురు ధర బ్యారెల్‌కు 102 డాలర్లను దాటింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న భారత్‌కు పెరిగిన క్రూడ్ ధరలు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.







కామెంట్‌లు (0)