గురువారం, 08 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅన్నే కార్సన్‌కు సాహిత్యంలో నోబెల్ పురస్కారం

4 గంటల క్రితం

అన్నే కార్సన్‌కు సాహిత్యంలో నోబెల్ పురష్కారం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 12:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

స్టాక్‌హోమ్ : సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి ప్రముఖ కెనడా రచయిత్రి అన్నే కార్సన్‌‌ను (76) వరించింది. 2026 సంవత్సరానికిగాను ఈ పురష్కారాన్ని స్వీడిష్ అకాడమీ గురువారం ప్రకటించింది. కార్సన్ సునిశితమైన శైలితో అనేక రచనలు చేశారు. ఆమె ముఖ్య రచనల్లో 2001లో వెలువడిన ‘ది బ్యూటీ ఆఫ్ ది హస్బెండ్: ఎ ఫిక్షనల్ ఎస్సే ఇన్ 29 టాంగోస్’ ఒకటి. మోసగాడైన భర్తతో జరిగే కలహాలను పదునైన వ్యంగంతో, చమత్కారం గానూ కార్సన్ ఈ రచన చేశారని అకాడమీ ప్రశంసిం చింది. అలాగే, సాంప్రదాయ సాహిత్యంతో ఆధునిక సాహిత్యానికి కొత్తరూపు తీసుకొచ్చా రని, అందుకే కార్సన్ ఈ అవార్డుకు అర్హురాలని పేర్కొంది. 1950లో కెనడాలోని టొరంటోలో జన్మించిన కార్సన్, 1981లో క్లాసిక్స్‌లో తన డాక్టరేట్ పరిశోధనా గ్రంథం ‘ఓడీ ఎట్ అమో ఎర్గో సమ్’ను ప్రచురించారు. అలాగే, ప్రాచీన గ్రీకు సాహిత్యాన్ని అనువదించడంలోనూ కార్సన్‌కు ప్రత్యేక గుర్తింపు పొందారు. పదాల మూలాలు, భాష, కవిత్వం మధ్య సంబంధాన్ని ఆమె రచనల్లో విభిన్నమైన రీతిలో ఆవిష్కరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్