గురువారం, 08 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజ్ఞానేష్‌ దిగిపో

1 గంట క్రితం

congress-1791480940367-4824.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 02:39 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • ఢిల్లీ నుంచి గల్లీ వరకూ మార్మోగిన నినాదం

  • గాంధీ సమాధి *వద్ద ప్రతిపక్ష‍ ఎంపిల నిరసన

  • బెంగళూరులో భారీ సభ

  • బీహార్‌, హైదరాబాద్‌, భువనేశ్వర్‌లో చలో లోక్‌భవన్‌

  • హైదరాబాద్‌లో మంత్రులు సహా పలువురి అరెస్టు

ఢిల్లీ : ‘ఓటు చోర్‌.. గడ్డీ చోడ్‌ (ఓటు దొంగ.. పదవి నుంచి దిగిపో)’ నినాదాలు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించాయి. ‘జ్ఞానూ.. ఇట్స్‌ డన్‌ బ్రో’ అంటూ యువత నినాదాల హోరు బెంగళూరు, ఢిల్లీ, బీహార్‌, హైదరాబాద్‌, భువనేశ్వర్‌, త్రిపుర సహా పలు ప్రాంతాల్లో మార్మోగింది. వరుసగా మూడోరోజూ దాదాపు 300 మంది ప్రతిపక్ష‍ ఎంపిలు ఆందోళన కొనసాగించారు. కాంగ్రెస్‌, సిపిఎం, వామపక్ష‍ాలుసహా ఇండియా వేదికలోని పార్టీలతోపాటు బిజెడి సహా పలు పార్టీలకు చెందిన ఎంపిలు, నేతలు భాగస్వాములయ్యారు. గాంధీ సమాధి రాజ్‌ఘాట్‌కు చేరుకున్న నిరసనకారులు శాంతియుతంగా ఆందోళన నిర్వహించారు. ‘ఈ ప్రభుత్వానికి, జ్ఞానేష్‌కుమార్‌కు విజ్ఞతనివ్వండి మహాత్మా’ అంటూ గాంధీకి మొరపెట్టుకున్నారు. బెంగళూరు ఫ్రీడమ్‌ పార్కులో భారీ సభకు అబిజిత్‌దీప్కే సహా సిజెపి అగ్రనేతలు, యూట్యూబర్‌ ధ్రువ్‌రాఠీ, సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌, కన్నడ రచయిత దేవనూర్‌ మహాదేవ, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గోపాల్‌గౌడ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మతోన్మాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన గౌరీ లంకేష్‌ సోదరి, చిత్ర నిర్మాత కవిత లంకేష్‌ సభలో మాట్లాడుతూ తన దత్తపుత్రుడిగా అభిజిత్‌ దీప్కేను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీ నిరసనల్లో దాడికి గురైన మహిళలకు సంఘీభావంగా ఇదే సభలో ‘చెప్పులతో’ యువతులు నిరసన తెలిపారు. అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పాలని, మహిళలపై హింసను అంతం చేయాలని నినదించారు. లంకేష్‌, ఓటు హక్కు కోల్పోయే ప్రమాదంలో ఉన్నవారంతా ఈ ర్యాలీలో భాగస్వాములవడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బీహార్‌లో చలో లోక్‌భవన్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ప్రతిపక్ష‍ నేత తేజస్వియాదవ్‌ బారికేడ్లను దాటి వెళ్లారు. దీంతో, గవర్నర్‌ వద్దకు ఆయనసహా ప్రతినిధి బృందాన్ని అనుమతించారు. అదే సమయంలో ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్ష‍ుడు ఆ ప్రాంగణానికి చేరుకోవడంతో ఆయనకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినదించారు. హైదరాబాద్‌లో చలో లోక్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లిన వారిని అడ్డుకోవడంతోపాటు మంత్రులుసహా పలువురిని అరెస్టు చేశారు. భువనేశ్వర్‌లోనూ చలో లోక్‌ భవన్‌ నిర్వహించి నిరసన తెలిపారు.

ఢిల్లీ రాజ్‌ఘాట్‌లో శాంతియుత నిరసన

గాంధీ సమాధి వద్ద నివాళి

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌కుమార్‌కు వ్యతిరేకంగా ‌దేశ రాజధానిలో ప్రతిపక్షాల ఆందోళన వరుసగా మూడో రోజూ కొనసాగింది. గురువారం ఇండియా బ్లాక్ కి చెందిన ఎంపిలు మహాత్మాగాంధీ స్మారకమైన రాజ్‌ఘాట్‌కు చేరుకుని శాంతియుతంగా నిరసన తెలిపారు. ఎంపిలతోపాటు వేలాది మంది కార్యకర్తలు కూడా రాజ్‌ఘాట్‌కు తరలివచ్చారు. గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం బిజెపి ప్రభుత్వానికి, ప్రధాన ఎన్నికల కమిషనర్‌‌కు కాస్తంత ‘విజ్ఞత’నివ్వాలంటూ ప్రార్ధించారు. అనంతరం నేతలు నిరసన చేపట్టారు. శుక్రవారం కూడా నిరసన కొనసాగుతుందని ప్రతిపక్ష నేతలు తెలిపారు. శుక్రవారం ఉదయం పార్లమెంట్‌ హౌస్‌ వద్ద సమావేశమయ్యే అవకాశం వుంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే, రాజ్యసభలో సిపిఎం పక్ష నేత జాన్‌ బ్రిట్టాస్‌, ఎంపీలు వి.శివదాసన్‌, ఎ.ఎ.రహీం, రాజ్యసభలో సిపిఐ పక్ష నేత పి.సంతోష్‌కుమార్‌, ఆర్‌జెడి ఎంపి మనోజ్‌ ఝా, తృణమూల్‌ కాంగ్రెస్‌ లోక్‌సభా పక్ష నేత అభిషేక్‌ బెనర్జీ, వయనాడ్‌ ఎంపి ప్రియాంకగాంధీ తదితరులు ఈ నిరసన కార్యక్రమానికి నాయకత్వం వహించారు.​ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ, ఓట్ల పారదర్శకత వుండాలని, తప్పులు చేసినవారు రాజీనామాలు చేయాలని, ప్రభుత్వం ఈ మొత్తానికి జవాబుదారీ వహించాలని డిమాండ్‌ ‌చేశారు. ఢిల్లీ కనాట్‌ప్లేస్‌లోని మొహెట్స్‌ హోటల్‌ నుంచి మూడు బస్సుల్లో రాజ్‌ఘాట్‌కు ఎంపిలు వెళ్లారు. ఆ బస్సులను అనుసరిస్తూ వేలాది మంది కార్యకర్తలు కాలినడకన రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా జ్ఞానేష్‌కుమార్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.

ఢిల్లీలో భారీగా పోలీసు బలగాలు మోహరించినా గత రెండు రోజుల మాదిరిగా గురువారం అడ్డుకోకుండా, రాజ్‌ఘాట్‌లోకి అనుమతించారు. మింటో రోడ్డులో బారికేడ్లు ఏర్పాటు చేసి నిరసనను అడ్డుకునేందుకు ప్రయత్నించినా, ఆ తర్వాత విరమించుకున్నారు.

రాష్ర్టపతితో భేటీ కోసం వేచిచూస్తున్నాం : కాంగ్రెస్‌

​రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కావాలని భావిస్తున్నామని, అందుకోసం ఆమె అప్పాయింట్‌‌మెంట్‌‌ను కోరామని కాంగ్రెస్‌ ‌ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ ‌చెప్పారు. ఈ నెల 2నే తొలిసారిగా అభ్యర్ధించామని, దానిపై సమావేశానికి వచ్చే నేతల పేర్లను ఇవ్వాలని రాష్ట్రపతి భవన్‌ ‌కోరిందని చెప్పారు. తిరిగి పేర్ల జాబితాతో 5వ తేదీన పంపామని, శుక్రవారం వరకు వేచి వుంటామని చెప్పారు.

​సమైక్య సమీకరణకై పిలుపు

శుక్రవారం జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద నిరసనల నేపథ్యంలో సిఇసికి వ్యతిరేకంగా సమైక్య సమీకరణ జరగాలని సిజెపి, ఎఐఎస్‌ఎ, ఇతర విద్యార్ధి సంఘాలు పిలుపునిచ్చాయి.

బీహార్‌లో అడ్డగింత

బీహార్‌లో చలో లోక్‌భవన్‌కు పాదయాత్ర నిర్వహిస్తున్న ఇండియా వేదిక నాయకులను పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. దీంతో, ప్రతిపక్ష‍ నేత, ఆర్‌జెడి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తేజస్వియాదవ్‌ బారికేడ్లు దాటారు. అనంతరం గవర్నర్‌ సయ్యద్‌ అత హుస్సేన్‌కు వినతిపత్రం సమర్పించేందుకు ఇండియా వేదిక ప్రతినిధులను అనుమతించారు. పోలీసులు అడ్డుకోవడంతో సిపిఐ (ఎంఎల్‌) నాయకులు, మాజీ ఎమ్మెల్యే అజిత్‌ కుష్వాహా స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలించారు. నిరసన సమయంలో బీహార్‌ బిజెపి అధ్యక్ష‍ుడు సంజయ్‌ అరోగి అక్కడకు రావడంతో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


cjp-1791480838782-8128.jpg

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్