గురువారం, 08 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాండిచ్చేరి వర్సిటీలో ఎస్ఎఫ్ఐ జయభేరి

3 గంటల క్రితం

పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ ఘనవిజయం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 12:32 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

పాండిచ్చేరి : ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కౌన్సిల్ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ ఘన విజయం సాధించింది. కౌన్సిల్లో మొత్తం 15 స్థానాలనూ కైవసం చేసుకుని క్లీన్ స్వీప్‌ చేసింది. యూనివర్సిటీ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా అరుంధతి, వైస్ ప్రెసిడెంట్ గా గోపిక విజయం సాధించారు. సెక్రటరీగా నల్ల సెల్వన్, జాయింట్ సెక్రటరీగా ప్రవేశ్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లుగా ఖదీజా, అనంగా, అక్షిత, దమ్మాఫీ, కావ్య ,అశోక్ కుమార్, సంజయ్, నివేద్, థామస్, హుస్సేన్ బట్ ఎన్నికయ్యారు. స్టూడెంట్ కౌన్సిల్ కు ఈ నెల 1న జరిగిన మొదటి దఫా ఎన్నికల్లో 114 రిప్రజెంటేటివ్స్ స్థానాలకుగాను 70 స్థానాలను ఎస్‌ఎఫ్‌ఐ కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో రిప్రజెంటేటివ్ లు గా ఎన్నికైన 114 మంది అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులతో పాటు 15 మందితో కూడిన స్టూడెంట్ కౌన్సిల్ ను ఎన్నుకున్నారు. కౌన్సిల్ లో మొత్తం 15 స్థానాలను ఎస్‌ఎఫ్‌ఐ సాధించింది.

రాజ్యాంగంపై దాడిని తిప్పికొట్టాలి : సంజీవ

రాజ్యాంగంపై దాడిని విద్యార్థి లోకం తిప్పికొట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత సంయుక్త కార్యదర్శి సంజీవ పిలుపునిచ్చారు. యూనివర్సిటీలో బుధవారం సాయంత్రం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గేటు వద్ద నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ ఫాసిజాన్ని పెంచి పోషిస్తున్న ఎబివిపిని తరిమికొట్టిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. భారత రాజ్యాంగంపై దాడి చేస్తున్న సంఘపరివార్ శక్తులను, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను విద్యార్థి లోకమంతా ఒక్కటై తిప్పి కొట్టాలని కోరారు. యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు సుఖదేవె, అగ్ని మాట్లాడుతూ మెస్ లో ఆహార పదార్థాల నాణ్యతా లోపాలు, మౌలిక సౌకర్యాలపై ఎస్ఎఫ్ఐ నిర్వహించిన రాజీలేని పోరాటాలకు మద్దతిచ్చిన విద్యార్థులు ఘనవిజయాన్ని అందించారని తెలిపారు. యూనివర్సిటీ అధికార యంత్రాంగం ఎంతగా ప్రయత్నించినా ఎబివిపికి గతం కంటే పది స్థానాలు తగ్గి 25 స్థానాలకే పరిమితమైందన్నారు. సభలో ఎస్ఎఫ్ఐ పాండిచ్చేరి రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్, పి యు స్టూడెంట్స్ కౌన్సిల్ మాజీ ప్రెసిడెంట్ శ్రేష్ట, ఎస్ఎఫ్ఐ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ స్టాలిన్, జాయింట్ సెక్రెటరీ అచ్చుతన్ తదితరులు మాట్లాడారు. యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ ఘన విజయం సాధించడం పట్ల సిపిఎం తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం, సుధా సుందర్ రామన్ తదితరులు అభినందనలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్