న్యూఢిల్లీ : విదేశీ నిధుల ప్రవాహంతో స్టాక్ మార్కెట్ సూచీలు ఎనిమిది నెలల గరిష్టాన్ని తాకాయి. సెన్సెక్స్, నిఫ్టీలు బుధవారం 1శాతం పెరిగి, ఎనిమిది నెలల గరిష్టానికి చేరినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. సెన్సెక్స్ 1.47శాతం పెరిగి రూ.82,301 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 1.25శాతం పెరిగి రూ.25,358వద్ద కొనసాగుతోంది. ఫిబ్రవరి 27 తర్వాత సూచీలు అత్యధిక గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ముడి చమురు ధరలు తగ్గడం, ఎఐ పెట్టుబడుల పట్ల జాగ్రత్త వహించడం వంటివి రెండేళ్ల నిష్క్రమణ తర్వాత తిరిగి విదేశీ పెట్టుబడిదారులు మార్కెట్ వైపు ఆసక్తి చూపేందుకు అవకాశం కలిగించాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. పెట్టుబడిదారులు ఏఐ-సంబంధిత పెట్టుబడుల వైపు మళ్లడం, పెరిగిన చమురు ధరలు ఆసియాలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయని పేర్కొన్నాయి. దీంతో గత రెండేళ్లలో చాలా కాలం పాటు భారత మార్కెట్లు ప్రపంచ మార్కెట్ల కంటే వెనుకబడ్డాయని తెలిపాయి. మరోవైపు అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత చమురు ధరలు, ఏఐ స్టాక్‌లు పడిపోవడం పెట్టుబడిదారుల పునరాలోచనకు దారితీసిందని వెల్లడించాయి.
ఎనిమిది నెలల గరిష్టానికి స్టాక్ మార్కెట్ సూచీలు
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 11, 2026, 01:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)