సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Markets - సద్దుమణిగిన ఉద్రిక్తతలు - లాభాల్లో స్టాక్ మార్కెట్లు ..!

1 గంట క్రితం

Tensions subside – Stock markets in the green..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 11:24 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

బిజినెస్ : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తాత్కాలికంగా తగ్గుముఖం పట్టడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం దేశీయ ఈక్విటీ మార్కెట్లకు ఊరటనిచ్చింది. దీంతో గత ఐదు వరుస ట్రేడింగ్‌ సెషన్లలో నష్టాలను చవిచూసిన ప్రధాన సూచీలు మళ్లీ కోలుకుని గ్రీన్‌జోన్‌లోకి ప్రవేశించాయి. ఉదయం 9.47 గంటల సమయానికి సెన్సెక్స్‌ 627 పాయింట్లు పెరిగి 76,692 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 181 పాయింట్ల లాభంతో 23,948 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా స్వల్పంగా బలపడి ₹96.18 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ సూచీలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌, ఇన్ఫోసిస్‌, ఎటర్నల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు ఓఎన్‌జీసీ, విప్రో, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, బజాజ్‌ ఆటో, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్