ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఔరా! అల్లరి పిల్లా!

2 గంటల క్రితం

alaparhty
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 08:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఔరా! అల్లరి పిల్లా! నిను

అదుపులో వుంచడమెల్లా?

అది సాధ్యం కాదెవ్వరి వల్లా!

అల్లరే వున్నది గద నీ నిలువెల్లా!!

అప్పటికప్పుడు ఇవ్వకపోతే

నిప్పులు తొక్కిన కోతి బాపతే!

తోటలొ గుంటలు తవ్వకపోతే

తోక తొక్కినా త్రాచు సామెతే!!

అన్నం తిందువు రమ్మని అంటే

ఆకలి లేదని పరుగెత్తితివి!

బ్రతిమిలాడి మరి తినమని అంటే

పాట పాడమని పట్టు పట్టితివి!!

అర్థరాతిరీ నిద్దుర లేచీ

అమ్మమ్మ కావాలని మారాము!

ముఖ్యంగా నీవు పెట్టుపేచీ

మూల కారణం అమిత గారాము!!

‘బాలబంధు’ అలపర్తి వెంకటసుబ్బారావు

(కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత)

9440805001

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్