ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionధన్యవాదాలు..

1 గంట క్రితం

zenzi danyavadalu .jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 09:36 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తడారిన గొంతులకు

నీళ్ళ సీసాలు తెచ్చిన మానవత్వపు

చేతులకు

ధన్యవాదాలు

ఆకలిగొన్న పేగుల అరుపులకు

జుమాటో డెలివరీ చేసిన

అదృశ్యపు చేతి వేళ్ళకు

ధన్యవాదాలు

రుతుస్రావపు రక్తపు మరకల్ని

దాచుకునేందుకు విష్పర్లు పంపిన

మాతృ హృదయాలకు

ధన్యవాదాలు

అలసిన ఉద్యమ దేహాలకు

చల్లని విసనికర్రల గాలులైన

గెడ్డం టోపీలకు

ధన్యవాదాలు

పగిలిన తలలకు.. నలిగిన ఎదలకు

ప్రేమ కట్టుతో గాయాలను ముద్దాడిన

పెదవులకు...

ధన్యవాదాలు

ఉద్యమ గొంతులో స్వరం కలిపిన

కీచురాళ్ళకు

చేతులతో ఉక్కు గొలుసులుగా

అల్లుకున్న అల్ప జీవులకు

​ధన్యవాదాలు.. ధన్యవాదాలు..

దేశమంటే కులం..మతం..కాదని

అంతా ఒక్కచేతులతో

చప్పట్లైనందుకు...

నేలపూరి రత్నాజీ

8919998753

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్