మంగళవారం, 01 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబంగారు పాపాయి..

1 గంట క్రితం

kavitha-
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 03:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఉయ్యాలా ఉయ్యాలా ఉయ్యాలా

ఊరంతా సందడే ఉయ్యాలా

చిన్నారి పాపా ఉయ్యాలా

చక్కని చుక్కా ఉయ్యాలా

ఉయ్యాలా ఉయ్యాలా ఉయ్యాలా

చల్లని గాలిలో ఉయ్యాలా

అమ్మ జోల పాడెను ఉయ్యాలా

కమ్మగా నిదురపో ఉయ్యాలా

ఉయ్యాలా ఉయ్యాలా ఉయ్యాలా

బోసి నవ్వుల పాపా ఉయ్యాలా

బంగారు తల్లివే ఉయ్యాలా

చల్లగా నిదురపో ఉయ్యాలా

ఉయ్యాలా ఉయ్యాలా ఉయ్యాలా

అమ్మమ్మ కథలతో ఉయ్యాలా

చందమామ వచ్చెను ఉయ్యాలా

చక్కగా పడుకోమ్మా ఉయ్యాలా

ఉయ్యాలా ఉయ్యాలా ఉయ్యాలా

ఊరంతా పండగే ఉయ్యాలా

నానమ్మ ఒడిలో ఉయ్యాలా

విజయమే నీదమ్మా ఉయ్యాలా

ఉయ్యాలా ఉయ్యాలా ఉయ్యాలా

చిన్నారి పాపా ఉయ్యాలా

చిరునవ్వుల తారా ఉయ్యాలా

కల్లో తేలిపో ఉయ్యాలా

​- మొర్రి గోపి,

కవిటి, శ్రీకాకుళం జిల్లా

88978 82202.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్