న్యూఢిల్లీ : లఢఖ్‌లో మొదటి శాశ్వత బెంచ్‌ను ఆదివారం లెహ్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రారంభించనున్నారు. ఈ చర్య కీలకమైనదని, ఇది ఈ ప్రాంత ప్రజలకు న్యాయాన్ని చేరువ చేస్తుందని లఢఖ్ ప్రధాన కార్యదర్శి అశిష్ కుంద్రా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది చాలా కీలకమైన పరిణామమని, గత 40 ఏళ్లలో దేశంలోని హైకోర్టుల చరిత్రను పరిశీలిస్తే.. ఏ ఇతర హైకోర్టులోనూ సిట్టింగ్ బెంచ్‌ను ఏర్పాటు చేయలేదని అన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని గౌహతి హైకోర్టు బెంచ్‌ను ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. గతంలో గ్వాలియర్‌లో కూడా ఇటువంటి బెంచ్ ఉందని అన్నారు. ఇకపై లఢఖ్‌లోని ప్రజలు న్యాయపరమైన ఉపశమనం కోసం (రిట్ పిటిషన్లు ) శ్రీనగర్ లేదా జమ్మూకు వెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి లఢఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా కూడా హాజరుకానున్నారని అన్నారు.








కామెంట్లు (0)