చిట్టి పాపాయి ఐదు నెలల పండుగ,
చిరునవ్వులతో నింపే ఆనందం.
బోసి నవ్వులు భలే ముద్దుగా,
బుడిబుడి మాటలు తియ్యగా.
చిట్టి చేతులు ఆడిస్తుంటే,
చూస్తూ మురిసే అమ్మానాన్నలే.
బుగ్గలు చూస్తే పువ్వుల్లా,
కళ్లు మెరిసే నక్షత్రాల్లా.
చిట్టి నవ్వే ఇంటికి వెలుగు,
నీ ఆటలే మాకు కనుల పండుగ.
నీ ముద్దు మురిపమే మా సంతోషం,
ఐదు నెలల పాపాయి నువ్వే మా ప్రపంచం!
-అన్నాబత్తుల పూజాస్వాప్నిక.
చంద్రాల, మైలవరం మండలం, ఎన్టీఆర్‌జిల్లా.








కామెంట్‌లు (0)