మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచిన్నారుల అదృశ్యంపై పూర్తి వివరాలివ్వండి

1 గంట క్రితం

ap high court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 11:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • జ్ఞానేశ్వరి ఆచూకీకి ప్రయత్నించండి : హైకోర్టు

ప్రజాశక్తి - అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా గతేడాది కాలంలో అదృశ్య మైన చిన్నారుల పూర్తి వివరాలను తమ ముందుం చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వారిలో బాలికలు, బాలురు ఎంత మంది ఉన్నారో, ఆచూకీ లభించిన వారు ఎంతమంది, ఇంకా జాడ తెలియనివారు ఎంతమంది వంటి వివరాలను సమర్పించాలని స్పష్టం చేసింది. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్‌ అగ్రహారం గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యంపై ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు, ఆమె ఆచూకీ కోసం కొనసాగుతున్న ప్రయత్నాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆచూకీ కోసం ప్రయత్నాలను కొనసాగించాలని సూచించింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లీసా గిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ కోసం సుప్రీంకోర్టు నిర్దేశించిన ఎస్ఒపిని అధికారులు అమలు చేయడం లేదని, జ్ఞానేశ్వరి విషయంలో తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని కోరుతూ న్యాయవాది జి శ్రీకాంత్‌ పిల్‌ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిగింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్