ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పెద్దూర్‌లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. మహాలక్ష్మి ఫర్నిచర్ షాప్, గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన కార్మికుడు మహమ్మద్ ఇస్లాం (39) సజీవ దహనమయ్యారు. సామగ్రి, కలప తదితర వస్తువులు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. పట్టణ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణమా? లేక ఎవరైనా కావాలనే నిప్పంటించారా? అనే అనుమానాలను యజమాని వ్యక్తం చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Print Editionఫర్నీచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడు సజీవ దహనం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 18, 2026, 11:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)