గురువారం, 27 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

చిలుకతో చిన్ని ముచ్చట్లు

2 గంటల క్రితం

కవిత.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 03:22 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అలుక ఎందుకే చిలుకా చిలుకా?

పంజరంలో బందీని నేను కనుక

పలకవేలా ఓ చిలుకా చిలుకా?

మనసులోన వేదన ఉన్నది కనుక

ఎగరవేలా ఓ చిలుకా చిలుకా?

రెక్కలు విప్పి ఎగరలేను కనుక

ఏమి కావాలి చిలుకా చిలుకా?

స్వేచ్ఛే నా సంతోషం కనుక

నేను చేయుదేమి చిలుకా చిలుకా?

తలుపు తీసి వదిలేయి బాలికా

ఎక్కడికి వెళ్తావు చిలుకా చిలుకా?

గూటికి చేరాలి గుడ్లున్నాయి కనుక

ఎందుకొరకు చిలుకా చిలుకా?

పొదగాలి వాటిని నేను కనుక

మరువవుగా ఓ చిలుకా చిలుకా?

మరువలేను నీ మంచితనం బాలికా

విడిచాను పొమ్మిక చిలుకా చిలుకా!

ధన్యవాదాలు బాలికా బాలికా!​

- కాశీ విశ్వనాథం పట్రాయుడు,

ఆంగ్ల ఉపాధ్యాయులు,

శృంగవరపుకోట, 94945 24445.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్