ఆదివారం, 08 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుంట చేసిన మేలు

21 నిమిషాల క్రితం

Ambulance Navigates a Rural Pothole.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026, 08:11 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

బామ్మగారొక నాడు

బాత్రూములో పడితె

చేర్చి హాస్పెటల్లో

చేయించిరి చికిత్స!!

​

బ్రెయినుడెడ్ అయ్యింది

చేయునది లేదింక

తీసుకెళ్లండనీ

తెలిపారు డాక్టర్లు!!

​

అంబులెన్సూలోన

ఆమెనూ ఇంటికీ

తీసుకెళ్ళాలనీ

చేసితిరి నిర్ణయం!!

​

రహదారి గుంటల్లొ

వాహనం పోతుంటె

పెద్దగుంటలొ పడీ

పెద్ద కుదుపొచ్చింది!!

​

కోమాలొ వున్నట్టి

ఆమె ఆ కుదుపుతో

స్పృహలోకి వచ్చింది

ఊహకందని రీతి!!

​

బామ్మ మరికొన్నాళ్లు

బతికింది హాయిగా!

గుంట చేసిన మేలు

గుర్తొచ్చి తీయగా!

​

​


​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్