అమావాస్య చీకటిలో
అందాల దీపాల వెలుగుల్లో
వెలుగుల పండుగ వచ్చిందోయ్
వీధివీధినా సందడి తెచ్చిందోయ్!
దీపాల వరుసల దీపావళి
దివ్యమైన ఆనందాల కేళి
ఇంటింటా దీపాల తోరణం
ఇల్లంతా సంతోషాల ఆవరణం!
చెడుపై మంచి గెలిచిందని
చరిత్రలో నిలిచిన పండుగని!
కుటుంబమంతా ఒక్కటై
ఆప్యాయతలు పంచే వేళ!
మట్టి ప్రమిదలో నూనె దీపం
మన సంస్కృతికి నిలువెత్తు రూపం
చిన్న దీపం ఇచ్చే సందేశం
చీకటిని తరిమే ఆత్మవిశ్వాసం!
దీపం వెలిగితే ఇంటికి వెలుగు
మనసు వెలిగితే లోకానికి వెలుగు
చీకటిపై వెలుగు విజయం…
చెడుపై మంచి గెలుపు!
ఈమని శ్రీసత్యసాంబశివరావు







కామెంట్లు (0)