శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇష్టమైన కష్టం!

7 గంటల క్రితం

కవిత.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 03:38 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఎండినగింజ

అమ్మ చేతిలో

ఆకలిని తీర్చే అమృతం

​నల్లబల్ల మీద

తెల్లని ఒజ్జ పంక్తి

జ్ఞానానికి పునాది

​సెలయేరులన్నీ

భానునితో గుసగుసలు

చినుకుల పందిరి

​చిక్కని పాలు

కవ్వంతో సయ్యాటలు

కన్నయ్య మెచ్చే వెన్న

నల్లని బండరాయి

ఎన్ని ఉలి దెబ్బలో

అందమైన శిల్పం

​అచ్చుల హల్లుల స్నేహం

జీవితానుభవంతో

కథల పేటిక

​సన్నని వెదురు మొక్క

రాగాల రంధ్రాలు

సొంపైన గీతం

​రేయిపగలు

నాన్న కష్టం

పిల్లల భవిత

​ఆపదలో పొరుగువారికి సాయం

ఇష్టమైన కష్టం

దేశమంతా మన ఇల్లేగా!

డా.నీరజ అమరవాది

98491 60055.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్