మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కొమ్ము బూర

2 రోజుల క్రితం

kommuboora
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 07:33 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

కవిత్వ కొయ్యకు కట్టిన తెప్ప

ఒడ్డు నీళ్ళ అలలపై తచ్చాడుతోంది

బహుదూరపు ప్రయాణం ఇప్పుడు

పురివిప్పిన ప్రకృతిలో

కొమ్ముబూర వోలే శబ్థిస్తుంది


ఓ అక్షరం ఓ వాక్యం

ఆనపకాయ బుర్రలా

వెదురునార విల్లులా

రేలాపాటల స్వరధారలా

విప్పపూల చెట్టుమీద వాలిన పిట్టలా

ఎంత సహజంగా వుందో ...


తొలి సంజె కిరణాలు

నిగూఢ భావంలా..

మబ్బుల్లోనే దాక్కుంటున్నాయి

ఆగని అశ్రు వాక్యమొక్కటి

వ్యధార్థితో వణికిస్తోంది

మంచు దుప్పటిలా పద్యం

వర్షపు చినుకులా గద్యం

నన్ను ఆసాంతం ఆవహించి

లోలోన లయాన్విత దరువులతో

ససేమిరా వీడనంటోంది...!


డా.కటుకోఝ్వల రమేష్,

సెల్:9949083327


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్