శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కోతి భయం

6 గంటల క్రితం

v
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 03:49 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

కోతి గంతులు వేసింది

ఏనుగు చూసి నవ్వింది!

కలిసి మెలిసి ఉన్నాయి

ఆడుతూ పాడుతూ తిరిగాయి!

కోతి ఎండిన తీగను చూసింది

పాము అనుకుని వణికింది!

గజరాజు నిజమును పసిగట్టింది

కోతికి గుట్టును విప్పింది!

కోతి నీటిలో బండను చూసింది

మొసలి అనుకుని అరిచింది!

ఏనుగు గట్టున నిలిచింది

నిజమును కోతికి తెలిపింది!

కోతి గాలి చప్పుడుకు బెదిరింది

సింహం అనుకుని ఉరికింది!

ఏనుగు శ్రద్ధగా విన్నది

గాలి శబ్దమని చాటింది!

కోతి తనలో తాను కుమిలింది

ఏనుగు హితవును పంచింది!

ఏకాగ్రత పాఠము నేర్పింది

కోతికి ధైర్యము పెంచింది!

కోతికి సత్యము తెలిసింది

చంచల స్వభావము వదిలింది!

భయమును పూర్తిగా విడిచింది

ప్రశాంత మార్గాన నడిచింది!

పైడిమర్రి రామకృష్ణ,

92475 64699.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్